Gudur: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ‘మహిళా ప్రజాదర్బార్’!
Gudur: గూడూరు P4 ఆఫీసులో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మహిళా ప్రజాదర్బార్.. పెన్షన్లు, హాస్టల్ సమస్యలపై అధికారులతో సమీక్ష, వినతుల స్వీకరణ.
Gudur: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ‘మహిళా ప్రజాదర్బార్’!
Gudur: గూడూరు పట్టణంలోని P 4 కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేకంగా మహిళా ప్రజాదర్బార్ నిర్వహించారు టిడిపి నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు అనంతరం పలు గ్రామాల మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేస్తూ అర్జీలు సమర్పించారు కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ నిర్వహించామని స్పందన బాగుందని రోడ్లు కాలువలు పలు సమస్యలు మహిళలు తెలియజేశారని వాటిఅన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు.
కోట ఎస్సీ హాస్టల్ మూసివేయడంతో విద్యార్థులను చిల్లకూరు నాయుడుపేట గురుకుల పాఠశాల పంపించారని వసతులు సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలియజేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కి సమస్యను తెలియజేస్తామని అన్నారు.
ఒంటరి మహిళ పెన్షన్ కొరకు 50 సంవత్సరాల దాటిన వారికి అని ప్రభుత్వం నిబంధన విధించిందని అయితే చాలామంది 50 సంవత్సరాలు లోపే ఒంటరి మహిళలు ఉన్నారని ఈ సమస్య గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవో అరుణకుమారి ,పలు శాఖల అధికారులు టిడిపి నాయకులు మట్టం శ్రావణి, లీలావతి ,భారతి, శ్రీదేవి ,కల్పన, సుబ్బమ్మ,తదితరులు పాల్గొన్నారు.




