Gudur: తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ.. 37 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న కుమారుడు

Gudur: తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి ఆలయంలో 37 ఏళ్లుగా అన్నదాన మహాయజ్ఞం సాగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Jun 2026 4:33 PM IST
Gudur
X

Gudur: తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ.. 37 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న కుమారుడు

Gudur: ఆకలితో ఉన్నవారికి పట్టేడు అన్నం పెట్టడం మించిన పుణ్యం లేదు అని పెద్దలు చెబుతుంటారు. సరిగా ఇదే సూత్రని పాటిస్తూ, తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ్ వీరబాద్ర స్వామి దేవాలయంలో గత 37 ఏళ్ళ నుండి అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ సేవ ఏజ్ఞానికి సుమారు 37 ఏళ్ళ క్రితం బీవీ రాఘవరెడ్డి అనే వేక్తి అన్న సంతర్పణ చేసారు. ప్రారంభం లో కేవలం 6 మందికి అన్నదానం చేయడం ప్రారంభించిన అయన తన శక్తి మేరకు ప్రతీ వారం దీనిని నిర్వహించారు. కాలక్రమేణా రాఘవ రెడ్డి మరణానించడంతో ఆ భాద్యతను తన కుమారుడు నారాయణరెడ్డి తన బుజాలపై వేసుకున్నారు.

ప్రస్తుతం ప్రతీ సోమవారం సుమారు 250 మందికి పైగా ఇక్కడ అన్నదానం జరుగుతోంది. దాత నారాయణరెడ్డి తన తండ్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దశాబ్దాలుగా ఎక్కడ ఆటంకం కలకుండా నిర్వాహస్తూ అందరి మనన్లు పొందుతున్నారు. ఈ పుణ్య కార్యక్రమం లో వినోద్, మోక్షన్, శివ, తదితరులు సేవ దృక్పధంతో సహకరిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story