Gudur: 5 రోజుల పని దినాలకై గూడూరులో బ్యాంకర్ల వినూత్న నిరసన!

Gudur: గూడూరులో మూతపడిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. 5 రోజుల పని దినాలకై స్టేట్ బ్యాంక్ వద్ద మోకాళ్లపై నడిచి ఉద్యోగుల వినూత్న నిరసన.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 6:30 PM IST
Gudur
X

Gudur: 5 రోజుల పని దినాలకై గూడూరులో బ్యాంకర్ల వినూత్న నిరసన!

Gudur: గూడూరు పట్టణంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులో మూతపడ్డాయి స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

తమ డిమాండ్ల నెరవేర్చాలని ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు జోనల్ సెక్రటరీ దాసరి రామచంద్రయ్య మోకాళ్ళపై నడిచి వినూత్నంగా నిరసన తెలిపారు అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

తిరుపతి మాడ్యూల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ విరూపాక్ష రాజు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు కల్పించాలని అనేక నెలలుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని కొద్ది రోజుల క్రిందట ఐదు రోజుల పని దినాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు చేయలేదని ఇప్పుడు ఐదు రోజుల పని దినాలు కుదరదని చెబుతున్నారని అన్నారు.

విపరీతమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దసలవారీగా ఆందోళన ఉధృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడమని ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ జోనల్ సెక్రటరీ దాసరి రామచంద్రయ్య, గూడూరు జోనల్ సెక్రటరీ ఎన్ శ్రావణ్ ,పీవీ కృష్ణయ్య,ప్రత్యూష, శ్రీకాంత్, కిరణ్ ,భాస్కర్ రెడ్డి ,వెంకటేశ్వర్లు, సుకుమార్, నందనాగార్జున ,కృష్ణ ప్రసాద్, పణి, భువనేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్