Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో గంటపాటు హైటెన్షన్ డ్రామా!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హైటెన్షన్ డ్రామా. రైలు పైకెక్కి ఆత్మహత్యాయత్నం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి కాపాడిన ఆర్‌పీఎఫ్, ఫైర్ సిబ్బంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 18 Sept 2026 10:12 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో గంటపాటు హైటెన్షన్ డ్రామా!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి బ్రిడ్జి పైకెక్కి హై టెన్షన్ రైల్వే లైన్ ఫై దూకి ఆత్మహత్య చేసుకుంటానని గంటపాటు ఉత్కంఠ విద్యుత్‌ సరఫరా నిలిపివేతతో రైళ్లకు అంతరాయం అప్రమత్తమైన అధికారులు.. ఫైర్‌, ఆర్‌పీఎఫ్‌,జీఆర్‌పీ పోలీసుల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రైలు పైకెక్కి ప్రమాదకరంగా హైటెన్షన్‌ వైర్‌ వద్దకు వెళ్లిన వ్యక్తిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

ఎట్టకేలకు ఫైర్‌ సిబ్బంది,ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి అతడిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలులో రేణిగుంటలో దిగిన ఆ వ్యక్తి ప్లాట్‌ఫాంపై కొద్దిసేపు హల్‌చల్‌ చేసినట్లు సమాచారం.పెద్దగా అరుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికుల్లో అయోమయం సృష్టించాడు.అనంతరం రైల్వే బ్రిడ్జి వైపు వెళ్లి అక్కడి నుంచి రైలు పైకి ఎక్కాడు.

రైలు పైకప్పుపైకి చేరుకున్న వ్యక్తి అక్కడ ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారింది.హైటెన్షన్‌ వైర్లకు సమీపంలోకి వెళ్లినా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.అదే సమయంలో రైల్వే సిబ్బంది,ఆర్‌పీఎఫ్‌,జీఆర్‌పీ పోలీసులు, ఫైర్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గంటపాటు ఉత్కంఠ.

వ్యక్తిని కిందకు దించేందుకు అధికారులు ప్రయత్నించడంతో స్టేషన్‌లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అత్యంత జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు.

ఎట్టకేలకు ఫైర్‌ సిబ్బంది, ఆర్‌పీఎఫ్‌,జీఆర్‌పీ పోలీసులు సమన్వయంతో వ్యక్తిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.దీంతో ప్రయాణికులు,రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అనంతరం నిలిపివేసిన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ వ్యక్తి అధికారులతో మాట్లాడుతూ పలు రకాలుగా చట్టపరమైన విషయాలను ప్రస్తావించినట్లు తెలిసింది.తనను అరెస్టు చేస్తే 48 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని,జడ్జి ముందే తాను మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా తన వద్దకు ‘త్రీ స్టార్‌’ అధికారి రావాలని కోరుతూ మాట్లాడినట్లు తెలిసింది.అతడి మాటతీరు,ప్రవర్తనను బట్టి మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అలా ప్రవర్తించాడా,లేక మద్యం మత్తులో ఉన్నాడా అన్నది అధికారులకు వెంటనే స్పష్టంగా తెలియలేదు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం హైటెన్షన్‌ వైర్‌ వద్దకు వ్యక్తి చేరుకున్న సమయంలో అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం,వెంటనే రక్షణ సిబ్బందిని రంగంలోకి దించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్‌ సరఫరా కొనసాగి ఉంటే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉండేదని ప్రయాణికులు,సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో కొద్దిసేపు రేణిగుంట రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, ఫైర్‌ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA