Gajulamandyam: గాజులమండ్యంలో ఉదయాన్నే మద్యం విక్రయాలు!

Gajulamandyam: తిరుపతి జిల్లా గాజులమండ్యంలో నిర్ణీత సమయం కంటే ముందే మద్యం విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు. ఎక్సైజ్ అధికారుల తీరుపై స్థానికుల నిరసన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 14 Sept 2026 9:35 AM IST
Gajulamandyam
X

Gajulamandyam: గాజులమండ్యంలో ఉదయాన్నే మద్యం విక్రయాలు!

Gajulamandyam: గాజులమండ్యం సంతగేటు వద్దనున్న మద్యం దుకాణం,ఈనాడు ఆఫీస్ వెనుక ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయం పరిసర ప్రాంతంలోని మద్యం దుకాణంలో నిర్ణీత సమయానికి ముందే మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఉదయాన్నే దుకాణం వద్ద మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మద్యం విక్రయాలకు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముందుగానే విక్రయాలు ఎలా సాగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్‌ కార్యాలయ పరిధిలోనే ఈ పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారుల పర్యవేక్షణపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కళ్ల ముందే జరుగుతున్నాయా? లేక పర్యవేక్షణ లోపించిందా? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

నిర్దేశిత సమయాలను పాటించకుండా విక్రయాలు నిజంగా జరుగుతున్నాయా? జరిగితే వాటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం స్థానికంగా చర్చకు వస్తున్నాయి. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA