Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానానికి అత్యవసర ల్యాండింగ్!

Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 130 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Sept 2026 6:00 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానానికి అత్యవసర ల్యాండింగ్!

Renigunta: హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1:50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం తిరిగి 2:25 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సుమారు గంట ఆలస్యంగా విమానం టేకాఫ్‌ అయినట్లు సమాచారం.

విమానం గాల్లోకి లేచిన అనంతరం అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో పైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. విమానాన్ని కొద్దిసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టించిన అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న సుమారు 130 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA