Renigunta: స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రేణిగుంటలో విస్తృత భద్రతా తనిఖీలు!
Renigunta: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్, పార్సిల్ కార్యాలయాల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
Renigunta: స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రేణిగుంటలో విస్తృత భద్రతా తనిఖీలు!
రేణిగుంట: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో రేణిగుంట పోలీసులు అప్రమత్తమయ్యారు.భద్రతా చర్యల్లో భాగంగా రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి రైల్వే స్టేషన్,పార్సిల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
రైల్వే స్టేషన్ పరిసరాలు,పార్సిల్ కార్యాలయంలో అనుమానాస్పద వస్తువులు,పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Next Story




