Tirupati: తుమ్మలగుంటలో జోరుగా 'ఇంటింటికీ తెలుగుదేశం'!
Tirupati: తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంట పంచాయతీలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం వైభవంగా సాగింది.
Tirupati: తుమ్మలగుంటలో జోరుగా 'ఇంటింటికీ తెలుగుదేశం'!
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీలో జోరుగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. ముందుగా తుమ్మలగుంట పంచాయతీకి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. పంచాయతీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.
దర్శనం అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించిన పులివర్తి సుధా రెడ్డి, తుమ్మలగుంట పంచాయతీలో 8వ రోజు కూటమి ప్రభుత్వ పాలనలో 2 ఏళ్ల నమ్మకం.. అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమం. కార్యక్రమంలో స్తానిక నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్ళి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్న పులివర్తి సుధారెడ్డి, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. తుమ్మలగుంట మఠం భూములలో కొన్ని సంవత్సరాలుగా కరెంట్ మీటర్లు లేక నరకయాతన పడిన లబ్ధిదారులు.
సమస్య విన్న వెంటనే పంచాయతీలోని మఠం భూములలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు కరెంట్ మీటర్లు ఇప్పించి వారిని ఆదుకున్న పులివర్తి నాని. కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు.
అనంతరం పంచాయతీలోని సమస్యలను పులివర్తి సుధా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన ప్రజలకు..ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపుతాం అని తెలిపిన పులివర్తి సుధా రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




