Sullurpeta: నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-18.. నేటి రాత్రి నుంచి కౌంట్‌డౌన్!

Sullurpeta: శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-18 రాకెట్ ద్వారా నావిక్-03 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. నేటి రాత్రి 11.51 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 29 Oct 2026 4:07 PM IST
Sullurpeta
X

Sullurpeta: నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-18.. నేటి రాత్రి నుంచి కౌంట్‌డౌన్!

సూళ్లూరుపేట: సమాచార సాంకేతిక రంగంలో మరో సమున్నత ఆధునిక వ్యవస్థను సమకూర్చేందుకు సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో నావిగేషన్ సిస్టంకు అనుసంధానం చేసేందుకు భారీ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టబోతోంది ఇస్రో రేపు అర్ధరాత్రి దాటాక తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రాకెట్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి - ఎఫ్ 18, నావిక్- 3 రాకెట్ ను రోదసిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాకెట్ అనుసంధాన ప్రక్రియకు లాంచ్ ఆథరైజ్డ్ బోర్డు.. ల్యాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది మరికొన్ని గంటల్లో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి రేపు అర్థరాత్రి 11.51 గంటలకు జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ జీఎస్‌ఎల్‌వీ -- ఎఫ్‌18 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిక్‌–03 ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెట్టనున్నారు. శాస్త్రవేత్తలు. జిఎస్ఎల్వి- ఎఫ్ 18 ప్రయోగానికి సంబంధించి నిన్న రాత్రి ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ల్యాబ్‌కు అప్పగించారు.

లాంచ్‌ ఆథరైజేష్‌ బోర్డు లాంచ్‌ రిహార్స్‌ల్‌ నిర్వహించి, ప్రయోగానికి 24 గంటల ముందు అంటే ఇవ్వాళ రాత్రి 11.51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తిచేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 సిరీస్‌లో ఇది 20వ ప్రయోగం. షార్‌ కేంద్రం నుంచి ఇది 107వ ప్రయోగం. జిఎస్ఎల్వి - ఎఫ్ 18 రాకెట్ ప్రయోగా నేపథ్యంలో ఇవాళ ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ శ్రీహరికోటకు రానున్నారు.ఇస్రో చైర్మన్‌ ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

ఇస్రో చేపట్టనున్న జిఎస్ఎల్వి -ఎఫ్18 ఉపగ్రహ వాహక నౌక ద్వారా నావిక్‌–03 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్స్‌స్టలేషన్‌... నావిక్‌ గా పిలిచే ఈ ఉపగ్రహం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది మన దేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ వ్యవస్థ. ఈ వ్యవస్థలో భారత్‌ క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల శ్రేణికి నావిగేషన్‌ సేవల కొనసాగింపుగా అందించేందుకు దీనిని రూపొందించారు. తదుపరి తరం నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థలో మూడో ఉపగ్రహం ఈ నావిక్‌–03. ఈ ఉపగ్రహంలో నావిగేషన్‌ పేలోడ్, రేంజింగ్‌ పేలోడ్‌ అనే రెండు రకాల పేలోడ్స్‌ను అమర్చారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.

జీఎస్ఎల్వి -- ఎఫ్ 18 ద్వారా రోదసిలోకి పంపనున్న నావిక్ -3 ఉపగ్రహం...నావిగేషన్‌ పేలోడ్‌ వినియోగదారులకు నావిగేషన్‌ సేవా సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఈ పేలోడ్‌ ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లతో పనిచేస్తుంది. ఈ పేలోడ్‌లో అత్యంత స్థిరమైన రుబీడియం అటావిుక్‌ క్లాక్‌ ఏర్పాటు చేశారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌ ఉపగ్రహాలలో దిగుమతి చేసుకున్న రుబీడియం అటావిుక్‌ క్లాక్‌లు విఫలం కావడంతో స్థానంలో అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించి ఈ ఉపగ్రహంలో అమర్చారు శాస్త్రవేత్తలు.ఇప్పటికే కొనుగోలు చేసిన అటావిుక్‌ క్లాక్‌లతో పాటు స్వదేశీ అటావిుక్‌ క్లాక్‌లు అమర్చి దీనిని అభివృద్ధి చేశారు.

ఇప్పటికే ఉన్న ఎల్‌5/ఎస్‌ సిగ్నల్స్‌కు అదనంగా ఎల్‌1 సిగ్నల్‌ను అందించి నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇది భారత భూభాగంపైన, దేశ సరిహద్దుల చుట్టూ 1,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతంపై కవరేజీ అందిస్తుంది. రెండో పేలోడ్‌ అయిన రేంజింగ్‌ పేలోడ్‌లో ట్రాన్స్‌ఫాండర్‌ ఉంది. ఇది రెండుమార్గాల కొలతల కోసం సీడీఎంఏ మోడ్‌లో పనిచేస్తుంది. ఈ కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహంలో పరిమిత వినియోగదారుల కోసం ఉపగ్రహ సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి మెరుగైన ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థ ఉంది.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta