Tirupati: జల్ జీవన్ మిషన్ సక్సెస్.. చిట్టత్తూరులో ప్రతి ఇంటికీ తాగునీరు

Tirupati: తిరుపతి జిల్లా చిట్టత్తూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల్ జీవన్ మిషన్' (హర్ ఘర్ జల్) క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 1 Jun 2026 10:51 AM IST
Tirupati
X

Tirupati: జల్ జీవన్ మిషన్ సక్సెస్.. చిట్టత్తూరులో ప్రతి ఇంటికీ తాగునీరు

Tirupati: జలజీవన్ మిషన్ (JJM) అనేది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం. దీనిని 'హర్ ఘర్ జల్' (ప్రతి ఇంటికి నీరు) అని కూడా పిలుస్తారు ఈ పథకం తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు గ్రామం నందు క్షేత్రస్థాయిలో అమలవుతుంది. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిలను బిగించి స్వచ్ఛమైన నీరు అందించడంతో ప్రజలు ఆ నీరును తాగుతూ ఆరోగ్యమైన జీవనం సాగిస్తున్నారు..

ఈ సందర్భంగా చిట్టత్తూరు గ్రామ అభివృద్ధి అధికారిని శాంతి మాట్లాడుతూ.. తమ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 557 గృహాలకు మంచినీటి కొళాయిలను బిగించి స్వచ్ఛమైన అందిస్తున్నామని, గ్రామస్తులు నీరు తాగుతూ ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలియజేశారు. తమ గ్రామంలో ఉన్న ఐదు వాటర్ ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన నీరును గ్రామస్తులకు అందజేస్తున్నామని, ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం ఈ వాటర్ ట్యాంకులను శుభ్రపరుస్తూ నీటిని అందజేస్తున్న మీ సందర్భంగా తెలియజేశారు.

గ్రామస్తులు మాట్లాడుతూ..

తమకు తమ గ్రామ అధికారిని ప్రతిరోజు మంచినీటిని తమకు కావాల్సినంత నీరుని అందజేస్తున్నారని ఈ నీటితోనే తాము తమ అవసరాలకు మరియు తమ జీవనాన్ని సాగించడానికి ఈ నీరుని ఉపయోగిస్తున్నామని తెలియజేశారు. ఈ నీరుని తాగడం వల్ల తాము ఆరోగ్యంగా ఉంటున్నామని కూటమి ప్రభుత్వంనికి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి తమకు అనునిత్యం స్వచ్ఛమైన నీరు అందజేసినందుకు కూటమి ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story