Tirupati: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జనసేన నేత హరిప్రసాద్ ఆహ్వానం!
Tirupati: 9వ జాతీయ టీ-20 దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆహ్వానించిన జనసేన ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్.
Tirupati: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జనసేన నేత హరిప్రసాద్ ఆహ్వానం!
Tirupati: తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్–ఇండియా, ఆంధ్రప్రదేశ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 9వ జాతీయ టీ-20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రికి అందజేశారు.
మంగళగిరి, అమరావతిలో అక్టోబర్ 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పసుపులేటి హరిప్రసాద్ గారు ఆహ్వానించారు.
దివ్యాంగ క్రీడాకారుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతో దోహదపడతాయని, క్రీడా రంగంలో వారికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానాన్ని స్వీకరించి, క్రీడాకారులకు తన పూర్తి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.




