Sullurupeta: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ‘చాయ్ విత్ జనసైనిక్స్’ నిర్వహించారు.
Sullurupeta: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు!
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు చేపట్టిన 'చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం అపూర్వ స్పందనతో కొనసాగుతోంది. ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ సూచనల మేరకు, పార్టీ నాయకులు షేక్ మాభాష నాయకత్వంలో, పరమేశ్వర నగర్‌లో వీర మహిళ సుజాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ, పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల దాస్, కయ్యాలకోటి, రేవంత్, శరవణ, సురేష్, దయాకర్, సుధీర్, శరత్, పద్మజ, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, పదేళ్లుగా భుజాల నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజా జీవితాన్ని కొనసాగించిన తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.వైద్య నిపుణుల బృందం ఆయన కుడి భుజానికి 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ'పై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, ఎడమ భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారు. తమ నాయకుడు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని సూళ్ళూరుపేట జనసైనికులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, అలాగే సూళ్ళూరుపేట ఆరాధ్య దైవం, అమ్మలకే అమ్మ అయిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దివ్య దీవెనలతో త్వరగా కోలుకుని, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన 'చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం, సూళ్ళూరుపేట రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.




