Naidupeta: నాయుడుపేటలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం!

Naidupeta: నాయుడుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, హరిప్రసాద్ దిశానిర్దేశం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 7:41 PM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేటలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల మరియు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తిరుపతి మరియు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్ మరియు ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు , ఉమ్మడి చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేషన్ టీం సభ్యులు కిరణ్ రాయల్ , బి. విజయ్ కుమార్, కీర్తన మరియు సపోర్ట్ టీం సభ్యులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం తిరుపతి లోనిహోటల్ ఉదయీ ఇంటర్నేషనల్, నందు నిర్వహించబడింది.

ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల సమన్వయం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే దిశగా సమష్టిగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, సూళ్లూరుపేట పట్టణ నాయకులు మరియు నాయుడుపేట పట్టణ నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్