Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ వ్యతిరేక రౌండ్ టేబుల్ భేటీ!

Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ భేటీకి జనసేన నేత మిథున్ శాలి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Oct 2026 12:29 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ వ్యతిరేక రౌండ్ టేబుల్ భేటీ!

Renigunta: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్ఐఆర్ (SIR) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేణిగుంట పట్టణంలోని స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), సీపీఎం,వివిధ ప్రజా సంఘాలు, గ్రామ పెద్దలతో పాటు అధికార కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి చెందిన స్థానిక నేత మిథున్ శాలి కూడా హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఎస్ఐఆర్ ఏర్పాటు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా కొనసాగుతూ పూర్తి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, వామపక్షాలు నిర్వహించిన నిరసన వేదికపై జనసేన నాయకులు మిథున్ శాలి ప్రత్యక్షం కావడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత మిథున్ శాలి మాట్లాడుతూ ఎస్ఐఆర్ (SIR) ప్రాజెక్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో స్పష్టమైన సంఖ్యాబలం (మెజారిటీ) ఉండటం వల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని,అయితే కేంద్ర స్థాయిలో విధానపరంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలయ్యే క్రమంలో లోపాలు,తప్పులు దొర్లడం సహజమని ఆయన అన్నారు.ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి,పూర్తి సమాచారం (డేటా) సేకరించి కలెక్టర్,ఆర్డీవో లకు సమర్పించాలని ఆయన సూచించారు.

ఆ విధంగా ఎస్ఐఆర్‌లో చోటుచేసుకున్న అవకతవకలను సులువుగా సరిదిద్దుకోవచ్చని (క్లియర్ చేసుకోవచ్చని) ఆయన తెలిపారు.ఒకవేళ స్థానిక అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాకపోతే, స్వయంగా తానే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా పరిష్కారం ఇప్పిస్తానని మిథున్ సాలి హామీ ఇచ్చారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో స్పష్టమైన సంఖ్యాబలం (మెజారిటీ) ఉండటం వల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని,అయితే కేంద్ర స్థాయిలో విధానపరంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలయ్యే క్రమంలో లోపాలు,తప్పులు దొర్లడం సహజమని ఆయన చెప్పారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA