Tirumala: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తిరుమలలో 1001 కొబ్బరికాయల మొక్కు!
Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 1001 కొబ్బరికాయలు సమర్పించిన జనసేన నేత మిథున్ శాలి. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు.
Tirumala: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తిరుమలలో 1001 కొబ్బరికాయల మొక్కు!
Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 1001 కొబ్బరికాయలు సమర్పించిన జనసేన నాయకుడు మిథున్ శాలి
జనసేన పార్టీ నాయకుడు మిథున్ శాలికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 1001 కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక మొక్కు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఉండాలని,ప్రజా సేవను నిరాటంకంగా కొనసాగించేలా దీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మిథున్ శాలి మాట్లాడుతూ,స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పవన్ కళ్యాణ్‌కు మరింత శక్తి, ఆరోగ్యం, విజయాలు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన తన సోదరుడు మురళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయానికి పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
"ఓం నమో వేంకటేశాయ" అంటూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.




