Sheikh Mabasha: కారు డ్రైవర్‌కు జనసేనలో కీలక పదవి: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!

Sheikh Mabasha: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యునిగా సూళ్ళూరుపేటకు చెందిన షేక్ మాభాష నియమితులయ్యారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 27 Jun 2026 8:14 AM IST
Sheikh Mabasha
X

 Sheikh Mabasha: కారు డ్రైవర్‌కు జనసేనలో కీలక పదవి: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!

సూళ్ళూరుపేట (తిరుపతి జిల్లా): జనసేన కీలక బాధ్యతల్లో తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట మాభాష​జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యునిగా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి చెందిన షేక్ మాభాష నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, తిరుపతి పార్లమెంట్ నాయకులకు, సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసైనికులకు, వీర మహిళలకు మరియు పార్టీ శ్రేణులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సమాచార సేకరణ కమిటీ సభ్యునిగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని, ప్రజా సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జనసేన సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మాభాష స్పష్టం చేశారు.

​మాభాష గారిది చాలా సాధారణ జీవితం. రోజువారీ కారు డ్రైవర్‌గా పనిచేస్తే తప్ప ఇల్లు గడవని దుస్థితిలో ఆయన ఉన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేని పేదరికం ఆయనది. కానీ, "మనకున్న దానిలో ఒక రూపాయి మంచి పని కోసం ఖర్చు చేయాలి" అనే గొప్ప ఆలోచన ఆయనది. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని, తాను కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఆయన వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో వలస కూలీల ఆకలి తీర్చడంలో మాభాష పోషించిన పాత్ర అద్వితీయం. స్నేహితులతో కలిసి నిత్యావసర వస్తువుల పంపిణీ, ఆర్థిక సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

​ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడంలో ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి అత్యవసరంగా రక్తం కావాలన్నా, కంటికి రెప్పలా స్పందించి స్వయంగా తాను రక్తదానం చేయడమే కాకుండా, తన స్నేహితుల ద్వారా కూడా రక్తదానం చేయిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. కేవలం రక్తం మాత్రమే కాదు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అవసరమైన వారికి కూడా ఎంతోమందికి ఇప్పించి ప్రాణదాతగా నిలిచారు. గత 17 ఏళ్లుగా మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న ఆయన, ఇప్పటివరకు 110 శిబిరాలను పూర్తి చేశారు. వ్యక్తిగతంగా 70 సార్లు రక్తదానం చేసిన మాభాష, లో ఏ ఆపద వచ్చినా ముందుండే సూళ్ళూరుపేటలో వ్యక్తిగా గుర్తింపు పొందారు. సేవే పరమావధిగా బతుకుతున్న మాభాషకు పార్టీలో కీలక బాధ్యత దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిజమైన నాయకుడు ప్రజల కష్టాల్లో భాగస్వామి కావాలని నిరూపించిన మాభాష, ఈ బాధ్యతతో పార్టీని మరింత బలోపేతం చేస్తారని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story