Tirupati: తిరుపతి జడా శ్రవణ్ పై కిరణ్ రాయల్ ఘాటు విమర్శలు
Tirupati: రేణిగుంటలో అడ్వకేట్ జడా శ్రవణ్‌పై జనసేన నేత కిరణ్ రాయల్ ఫైర్. శ్రవణ్ ఆరోపణలు, డబ్బు మూలాలు, కుల రాజకీయాలపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్.
Tirupati: తిరుపతి జడా శ్రవణ్ పై కిరణ్ రాయల్ ఘాటు విమర్శలు
రేణిగుంట: జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్, అడ్వకేట్ జడా శ్రవణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రవణ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. జడా శ్రవణ్ లిల్లీపుట్ కాదు.. ఆయనొక సిల్లీ పుట్. పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అనవసరమైన డ్రామాలు ఆడుతున్నారు.
జైలుకు వెళ్లడానికి ఆయన తెగ తహతహలాడుతున్నారు అంటూ కిరణ్ రాయల్ ఘాటుగా విమర్శించారు. కులమే లేని ఎఫ్ఐఆర్ (FIR) లో కులాన్ని అంటగట్టిన ఘనత శ్రవణ్‌దే. సుగాలి ప్రీతి కేసులో నిందితులు కె.జనార్దన్ రెడ్డి, కె.హర్షవర్ధన్ రెడ్డి అని తెలిసినా, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం చాలా బాధాకరం.
కావాలంటే విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోండి.. రాయలసీమ రెడ్లను కాపులు అనరు అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో 25 కోట్లు ఖర్చు పెట్టానని శ్రవణ్ స్వయంగా చెబుతున్నారు. అసలు అంత డబ్బు ఎక్కడిది? దీనిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరపాలి అని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
అధికారమే లేని పార్టీకి డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటూ వీరు ఊహల్లో బ్రతుకుతున్నారు. ఒకడు జైల్లో ఉంటే, మరొకడు బయట తిరుగుతూ జోకర్లలా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సిల్లీ అడ్వకేట్‌ను నమ్ముకుంటే జైల్లో చిప్పకూడు తినడం ఖాయం. చివరగా కిరణ్ రాయల్ ఒకటే హెచ్చరిక జారీ చేశారు.పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం మానుకోకపోతే చూస్తూ ఊరుకోమని, అడ్వకేట్ శ్రవణ్ వ్యవహారశైలిపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.




