Kodur: శెట్టిగుంట పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా కోలా శ్రీలత
Kodur: రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట సర్పంచ్‌గా కోలా శ్రీలత, 14 వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక; కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు.
Kodur: శెట్టిగుంట పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా కోలా శ్రీలత
రైల్వే కోడూరు: రైల్వే కోడూరు మండలంలోని అతిపెద్ద గ్రామపంచాయతీల్లో ఒకటైన శెట్టిగుంట గ్రామపంచాయతీ ఏకగ్రీవ ఎన్నికతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. గ్రామ సర్పంచ్‌గా శ్రీమతి కోలా శ్రీలతతో పాటు మొత్తం 14 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ ఏకగ్రీవ ఎన్నిక వెనుక మాజీ శాసనమండలి సభ్యులు భత్యాల చెంగల్ రాయుడు కీలక పాత్ర పోషించారు. మొత్తం ఎన్నికల వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ, గ్రామ నాయకులు, పెద్దల మధ్య సమన్వయం సాధించి పంచాయతీ ఏకగ్రీవానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కోలా శ్రీలత మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామ పెద్దల ఆశీస్సులతో, ప్రజల సహకారంతో శెట్టిగుంట గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
శెట్టిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గ్రామ ఐక్యతకు, నాయకుల సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.




