Kodur: మాధవరంపాడు సర్పంచ్‌గా ఏడుక రాజా ఏకగ్రీవ ఎన్నిక.. సంబరాలు

Kodur: రైల్వే కోడూరు మండలం మాధవరంపాడు సర్పంచ్‌గా ఏడుక రాజా, ఉప సర్పంచ్‌గా గిరిరాజు ఏకగ్రీవ ఎన్నిక; సత్కరించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.

PRASAD, KODURU
Published on: 21 Nov 2026 9:38 PM IST
Kodur
X

Kodur: మాధవరంపాడు సర్పంచ్‌గా ఏడుక రాజా ఏకగ్రీవ ఎన్నిక.. సంబరాలు

రైల్వే కోడూరు: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మాధవరంపాడు గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏడుక రాజా, మరియు ఉప సర్పంచ్ గా చక్రవర్తుల గిరిరాజు ను మరియు వార్డు మెంబర్లను గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో గ్రామంలో పండుగవలె సందడి మొదలైంది.

గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాలుస్తూ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికిన మాధవరంపోడు గ్రామ ప్రజలు అనంతరం సర్పంచు మరియు ఉప సర్పంచ్ &వార్డు మెంబర్లు అందరిని పూలమాలవేసి శాలువాతో సత్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లు రాజారెడ్డి, ఎంపీటీసీ గండా సురేంద్ర రెడ్డి,కంపరాజు నాగేంద్ర రాజు, కృష్ణ రెడ్డి,ఎక్స్ ఎంపీటీసీ మహేష్,కుమార్ రాజు,సిద్దయ్య,బుజ్జి,మరియు గ్రామస్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU