Srikalahasti: బెరివారి మండపం మట్టి వినాయకుని నిమజ్జనానికి తరలిరావాలని కోలా ఆనంద్ పిలుపు!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని బెరివారి మండపంలో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహ నిమజ్జనం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం మాజీ అధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు.
Srikalahasti: బెరివారి మండపం మట్టి వినాయకుని నిమజ్జనానికి తరలిరావాలని కోలా ఆనంద్ పిలుపు!
Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలోని బెరివారి మండపంలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మట్టి విగ్రహ నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాన్ని మంగళవారం, సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం మాజీ అధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు, గణేష్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ప్రార్థిస్తూ నిమజ్జన ఊరేగింపులో పాల్గొనాలని కోరారు.
మన ఇళ్లలో, మన ప్రాంతాల్లో, మన దేశంలో ఉన్న కష్టాలు, ప్రతికూల శక్తులను వినాయకుడు తనలో లీనం చేసుకుని నిమజ్జనం రూపంలో మన నుంచి తొలగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కోలా ఆనంద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




