Tirupati: ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ.. గ్రామస్థుల వినూత్న బ్యానర్
Tirupati: తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కొత్తూరు గ్రామస్థులు వినూత్న రీతిలో స్పందించారు.
Tirupati: ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ.. గ్రామస్థుల వినూత్న బ్యానర్
Tirupati: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలను మాన్పించి, తమ పిల్లలను ప్రైవేటు స్కూల్స్ లో తల్లిదండ్రులు జాయిన్ చేయడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. అందుకు భిన్నంగా తిరుపతి జిల్లా బాలాయపల్లి, కొత్తూరులో చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు వినూత్న రీతిలో స్పందించారు.
ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో సాధించిన ఫలితాలు చూసి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముక్కున వేలేసుకున్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న నాణ్యమైనటువంటి విద్య, ప్రభుత్వ పాఠశాలలో సైతం ఇంగ్లీష్ మీడియం వంటి విప్లవాత్మకమైన మార్పులతో..ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వెలువడటంతో జనంలో మార్పు మొదలైందని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపట్టిన. "బడి పిలుస్తుంది" కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.
తిరుపతి డీఈఓ కె.వి.ఎన్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న "బడి పిలుస్తోంది" 36 మండలాలు 36 రోజులు ఇంటింటికీ ప్రచార రథం ఎఫెక్ట్ తో. మా గ్రామం లోకి ప్రైవేట్ స్కూల్స్ బస్ లు వద్దంటూ గ్రామ ప్రవేశం వద్ద బ్యానర్ కట్టారు కొత్తూరు, బాలాయపల్లి గ్రామస్థులు. గొప్ప నిర్ణయం తో శభాష్ అనిపించుకుంటున్నారు గ్రామ ప్రజలు.
"బడి పిలుస్తోంది" కార్యక్రమం స్ఫూర్తి తో తమ గ్రామం లోని ప్రభుత్వ బడి లోనే తమ పిల్లలను చేర్పించాలని తీర్మానం చేసుకొని,ఇకపై ప్రైవేట్ స్కూల్స్ బస్ లు మా గ్రామం లోకి వద్దంటూ బ్యానర్ ను గ్రామ ప్రవేశం వద్ద కట్టారు. ఈ కార్యక్రమం లో స్కూల్ కమిటీ చైర్మన్ మల్లిఖార్జున, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో MEO లు జీ.నాగేశ్వరరావు, ప్రదీప్ కుమార్, హెచ్. ఎం రత్నయ్య లు పాల్గొన్నారు.




