Srikalahasti: నూతన అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి కుంభాభిషేకం
Srikalahasti: శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు.
Srikalahasti: నూతన అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి కుంభాభిషేకం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో కుంభాభిషేకం మరియు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవాసమితి ప్రతినిధులు తెలిపారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవాసమితి (SASVTSS 74/2026)
Next Story




