Kuppam: కుప్పం గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై అపోహలు నమ్మకండి

Kuppam: కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ. 8 కోట్లు మంజూరు. ఆలయ చైర్మన్ బీఎంకే రవిచంద్రబాబు మీడియా సమావేశం వివరాలు.

KUMAR, KUPPAM
Published on: 4 Aug 2026 3:00 PM IST
Kuppam
X

Kuppam: కుప్పం గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై అపోహలు నమ్మకండి

కుప్పం: కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆలయ చైర్మన్ BMK రవిచంద్రబాబు. వైసీపీ హయంలో తిరుపతి గంగమ్మ ఆలయాన్ని రాతితో పునర్నమిస్తామని ఆలయాన్ని కూల్చి వేశారు.

రాతితో కట్టకుండా సిమెంట్ తో ఆలయాన్ని నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు రూ. 8 కోట్లు మంజూరు చేశారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక ఆలయాలను నిర్మించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది.

అమ్మవారి విశ్వరూప దర్శనానికి పెద్ద సంఖ్యలో లక్షల్లో భక్తులు తరలి వస్తారు. తిరుపతిలోని తాతయ్యగుంట ఆలయం తరహాలో కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని గంగమ్మ ఆలయాన్ని పునర్నిమిస్తాం. రాజకీయాలకతీతంగా తిరుపతి గంగమ్మ ఆలయాన్ని పునర్నిర్మిస్తాం. ఆలయ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి.

కొంత మంది వారి స్వార్థానికి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు. గర్భాలయం, అంతర్ గర్భాలయం, మహా మండపం ను నిర్మించడం జరుగుతుంది.

తిరుపతి ఆలయ పునర్నిర్మాణం పై కొంత మంది అపోహలు సృష్టిస్తున్నారు, అలాంటి పుకార్లను, అపోహలను నమ్మకండి. ఆలయ కమిటీ సభ్యుల్లో ఆలయ పునర్నిర్మాణం పై బిన్నాభిప్రాయాలు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story