Srikalahasti: కూటమి రెండేళ్ల పాలన.. శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ

Srikalahasti: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో 'రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 19 Jun 2026 3:58 PM IST
Srikalahasti
X

Srikalahasti: కూటమి రెండేళ్ల పాలన.. శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ

శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తైన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో శ్రీకాళహస్తి లోని ఎస్ ఎస్ కళ్యాణమండలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,, రాష్ట్ర యాదవ సంఘం చైర్మన్ నరసింహయాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్.

శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టేసాయి పాల్గొన్నారు, విజయోత్సవసభలో ప్రసంగించారు,రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం' అనే నినాదంతో ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించింది రానున్న ఎన్నికల్లో మరో మారు ప్రభుత్వానికి విజయం చేకూర్చాలని కోరారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రజల పడిన కష్టాల ఫలితమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజల నమ్మకం మరింత ఉండేవిధంగా నేడు పరిపాలన కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఘనత వైకాపా నాయకులకే దక్కితే ప్రస్తుతం తిరుపతిలో, చెడిపోయిన చికెన్ విద్యార్థులకు పెట్టి వారి ఆరోగ్యంతో చలగాటమాడిన ఘనతకూడా వైకాపా నాయకులకే దక్కుతుందని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు శ్రీకాళహస్తి నుంచి శ్రీకారం చుట్టామని ,గత ఎనిమిదేలుగా గంజాయిని సరఫరా చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని, అందులో భాగస్వాములైన కొంతమంది పోలీసులను సస్పెండ్ , మరియు మెమో ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story