Tiruchanur: బంగారు తిరుచ్చిపై ఊరేగిన శ్రీసూర్యనారాయణ స్వామి

Tiruchanur: తిరుచానూరు శ్రీసూర్యనారాయణ స్వామి వారి జన్మనక్షత్రం సందర్భంగా స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 10 Oct 2026 5:23 PM IST
Tiruchanur
X

Tiruchanur: బంగారు తిరుచ్చిపై ఊరేగిన శ్రీసూర్యనారాయణ స్వామి

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారు శనివారం బంగారు తిరుచ్చి పై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం హస్త నక్షత్రము సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చి పై కొలువుదీర్చారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు తిరుచ్చి పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు.

పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ లు ముని చెంగల్రాయులు, సురేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL