Tirumala: శ్రీవారిని దర్శించుకున్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా!

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, నాయకులు కట్టా దొరస్వామి నాయుడు. శేషవస్త్రాలతో సత్కరించిన అధికారులు.

Srinivasulu, Madanapalle
Published on: 24 July 2026 12:19 PM IST
Tirumala
X

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా!

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం వీఐపీ దర్శనంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, రాష్ట్ర యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు శ్యామ్ కలిసి దర్శించుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story