Srikalahasti: ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో కొత్త రహదారి!
Srikalahasti: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో 'పల్లె పండుగ - 2.0' లో భాగంగా రూ.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నూతన తారు రహదారి.
Srikalahasti: ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో కొత్త రహదారి!
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల గ్రామ పరిధిలో ప్రజలకు మరో అభివృద్ధి ఫలితం అందుబాటులోకి వచ్చింది.
'పల్లె పండుగ - 2.0' కార్యక్రమంలో భాగంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS 2025-26) కింద రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన మాధవమాల రోడ్డు నుంచి చుండికండ్రిగ గ్రామం వరకు తారు రహదారిను ఈరోజు ప్రజలకు అంకితం చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవల రవాణాకు కూడా ఇది ఎంతో ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ కృషి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




