Srikalahasti: వేగమే ప్రాణం తీసింది! ఆగి ఉన్న లారీని గుద్దేసిన అంబులెన్స్!
Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు హైవేపై ఘోర ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్.
Srikalahasti: వేగమే ప్రాణం తీసింది! ఆగి ఉన్న లారీని గుద్దేసిన అంబులెన్స్!
Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోనే ఊరందురు హైవే రోడ్డు పై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినది ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా ఇద్దరికీ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డి.ఎస్.పి నరసింహమూర్తి అందించిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఊరందురు హైవే రోడ్డులో ఆగి ఉన్న లారీని వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకు చెందిన అంబులెన్స్ అతివేగంగా వెళ్లి ఢీ కొట్టిందని అంబులెన్స్ లో ఉన్న ఆరుగురు లో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు.
ముగ్గురు మగవారు ఒక మహిళ మృతి చెందినట్లు తెలిపారు, ఇద్దరికీ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం క్రేను సహాయంతో వాహనాల నుండి మృతదేహాలను వెలికి తీసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.




