Railway Koduru: రైల్వేకోడూరులో చోరీ: 10 తులాల బంగారం అపహరణ
Railway Koduru: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని సీతారాంనగర్‌లో ప్రణీత్ రెడ్డి ఇంట్లో తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారం, 3 కిలోల వెండిని దుండగులు అపహరించారు.
Railway Koduru: రైల్వేకోడూరులో చోరీ: 10 తులాల బంగారం అపహరణ
రైల్వేకోడూరు: పట్టణంలోని సీతారాంనగర్‌లో నివాసం ఉంటున్న ప్రణీత్ రెడ్డి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హెల్మెట్లు ధరించిన దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 3 కిలోల వెండిని అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.




