Renigunta: రేణిగుంటలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Oct 2026 7:46 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య!

Renigunta: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రేణిగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..రేణిగుంట మండలం వెదళ్లచెరువు ఎస్టీ కాలనీకి చెందిన కొడవల కిరణ్ (30) వ్యవసాయ కూలీగా, అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యపానానికి బానిసైన కిరణ్‌ను మద్యం మానుకోవాలని భార్య మౌనిక పలుమార్లు సూచించేది.ఈ క్రమంలో ఈ నెల 28న రాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు.

అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 29న సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA