Tirupati: తిరుపతి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం శ్రీనివాస ప్రసాద్!
Tirupati: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా మన్నెం శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
Tirupati: తిరుపతి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం శ్రీనివాస ప్రసాద్!
Tirupati: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ఎన్నికైన మన్నెం శ్రీనివాస ప్రసాద్ @ జేబీ శ్రీనివాస్ బుధవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్పొరేషన్ కార్యాలయంలో వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత మేయర్ గా తన ఛాంబర్ లోకి ప్రవేశించి, తొలి సంతకం చేసి పాలనకు శ్రీకారం చుట్టారు. తొలి సంతకాన్ని కళ్యాణి డ్యామ్ లో నీటి కొరత ఏర్పడిన సందర్భంలో ప్రత్యామ్నాయ నీటి వనరుగా తెలుగు గంగా నీటిని వినియోగించుకునేందుకు వీలుగా మెడికల్ కాలేజీ జి.యల్ . ఆర్.ఎస్., బి. పి. ట్యాంకుల మధ్య 350 మి.మీ డి.ఐ. పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను అనుసంధానం చేయడం.
దీని ద్వారా ఆయా ప్రాంతాలకు నిరంతరం నీటి సరఫరా అందించే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమానికి కమీషనర్ జయకృష్ణ, డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, తాతయ్యగుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్పొరేషన్ , అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మేయర్ కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.




