Srikalahasti: MGM హాస్పిటల్‌లో మెగా రక్తదాన శిబిరం ఉచిత వైద్య పరీక్షలు!

Srikalahasti: MGM గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 26న శ్రీకాళహస్తి MGMలో ఉచిత వైద్య పరీక్షలు, మెగా రక్తదాన శిబిరం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 24 Aug 2026 2:29 PM IST
Srikalahasti
X

Srikalahasti: MGM హాస్పిటల్‌లో మెగా రక్తదాన శిబిరం ఉచిత వైద్య పరీక్షలు!

Srikalahasti: MGM గ్రూప్ చైర్మన్ శ్రీ గుడ్లూరు మల్లికార్జున నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆగస్టు 26వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి MGM హాస్పిటల్స్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

ఈ విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్, MGM గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదాన శిబిరంలో MGM గ్రూప్ కుటుంబ సభ్యులతో పాటు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు.

అదేవిధంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఆ రోజు MGM హాస్పిటల్స్‌ను సందర్శించే ప్రజలకు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. సుమారు *రూ.2,500 విలువైన ఎముకల పటుత్వ పరీక్ష (BMD)*ను కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ గుడ్లూరు మయూర్ పిలుపునిచ్చారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story