Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం!

Venkatagiri: తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

A Praveen, Nellore
Published on: 1 Oct 2026 9:25 AM IST
Venkatagiri
X

Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం!

Venkatagiri: వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

అక్టోబర్ 1, 2026 గురువారం ఉదయం 11 గంటలకు వెంకటగిరిలో జరిగే పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి ఆనం పాల్గొని, రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు, తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore