Tirupati: తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రులు లోకేష్, అనగాని

Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్, ఇన్‌చార్జి మంత్రి అనగానికి ఘన స్వాగతం. రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి పనుల సమీక్ష.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 July 2026 4:02 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రులు లోకేష్, అనగాని

తిరుపతి: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీవో బానుప్రకాశ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, షాప్ చైర్మన్ రవి నాయుడు, మాజీ మంత్రి పనబాక లక్ష్మి ,క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్స్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మతో పాటు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు,అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రులకు స్వాగతం పలికారు.మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల సమీక్షలు, ప్రజాప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story