Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు!
Srikalahasti: శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు!
Srikalahasti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయమే శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరు మీద సంకల్పం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
అనంతరం రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అల్పాహారం, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కోలా ఆనంద్‌తో పాటు శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, ఉపాధ్యక్షులు పుణ్యం ఢిల్లీ కుమార్, కార్యదర్శి కటికం చంద్రశేఖర్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఫ్లెక్సీ కృష్ణారెడ్డి, గునకల వెంకట సుబ్బయ్య, సజ్జ హరీష్, డక్కిలి శివ, రమేష్ నాయుడు, శ్యామ్, శ్రీధర్, బిందు కుమార్, నాని, వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు.




