Obulavaripalle: ముక్కావారిపల్లెలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం!

Obulavaripalle: ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లెలో కూటమి సర్పంచ్ అభ్యర్థి సుప్రియ పొలసాని, వార్డు అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రచారం చేశారు.

PRASAD, KODURU
Published on: 22 Nov 2026 9:21 PM IST
Obulavaripalle
X

Obulavaripalle: ముక్కావారిపల్లెలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం!

ఓబులవారిపల్లి: ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లె గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారు, శ్రీమతి రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు ప్రచారం నిర్వహించారు. స్వగ్రామంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచ్ అభ్యర్థి:

* గంప గుర్తుపై శ్రీమతి సుప్రియ పొలసాని గారు

వార్డు సభ్యుల అభ్యర్థులు:

* 1వ వార్డు: శ్రీమతి సునీత ఎర్రబాబు – గౌను గుర్తు

* 2వ వార్డు: శ్రీ జగదీశ్వర్ రెడ్డి శ్రీనాదం – కుక్కర్ గుర్తు

* 3వ వార్డు: శ్రీ శివకుమార్ చిట్వేలి – గౌను గుర్తు

* 5వ వార్డు: శ్రీ కిష్టయ్య కప్పల – గౌను గుర్తు

* 6వ వార్డు: శ్రీమతి భార్గవి మారేళ్ల – కుక్కర్ గుర్తు

* 7వ వార్డు: శ్రీ ఖలీల్ షేక్ – కుక్కర్ గుర్తు

* 8వ వార్డు: శ్రీమతి శోభారాణి అమృతాల – గౌను గుర్తు

* 9వ వార్డు: శ్రీ యానాదయ్య ఎలిసెట్టి – గౌను గుర్తు

* 10వ వార్డు: శ్రీమతి భార్గవి ఆముదాల – గౌను గుర్తు

* 11వ వార్డు: శ్రీ విశ్వనాథరెడ్డి సింగమల – గౌను గుర్తు

* 12వ వార్డు: శ్రీమతి గంగాదేవి కుంచపు – కుక్కర్ గుర్తు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి గారు అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజల ముందుకు వెళ్తున్నారు.

ముక్కావారిపల్లె గ్రామ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థుల సమష్టి కృషికి ప్రజల భాగస్వామ్యం కోరుతూ ప్రచారం కొనసాగింది.

PRASAD, KODURU

PRASAD, KODURU