SriKalahasti: శ్రీకాళహస్తి ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

SriKalahasti: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో జూలై 17 నుండి ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా గోడపత్రికల ఆవిష్కరణ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 9 July 2026 3:50 PM IST
SriKalahasti
X

SriKalahasti: శ్రీకాళహస్తి ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడే పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.కె. వెంకటేశులు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాన్ని పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఉప కార్యనిర్వహణాధికారులు, ఏఈఓలు, పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు, ప్రోటోకాల్ అధికారులు, అనుబంధ ఆలయాల ఛైర్మన్లు, బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story