Srikalahasti: అన్నా క్యాంటీన్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

Srikalahasti: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి, స్వర్ణముఖి నది వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 May 2026 3:42 PM IST
Srikalahasti
X

Srikalahasti: అన్నా క్యాంటీన్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది సమీపంలోని అన్నా క్యాంటీన్‌తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లలో భోజనం చేస్తున్న ప్రజలతో మమేకమై, అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులపై ఎమ్మెల్యే స్వయంగా ఆరా తీశారు. భోజనం ఎంతో రుచికరంగా, సంతృప్తికరంగా ఉందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను పరిశీలించగా భోజన వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన కొందరు ప్రజలు కూడా “అమ్మ క్యాంటీన్ కంటే ఆంధ్రప్రదేశ్‌లోని అన్నా క్యాంటీన్‌లో భోజనం ఎంతో బాగుంది” అని చెప్పడం ఆనందంగా ఉందన్నారు.

అలాగే రేణిగుంటలో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. పేద ప్రజలకు ఆకలి లేకుండా పోషకాహారం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story