Tada: వాటంబేడు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే విజయశ్రీ

Tada: వాటంబేడు సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ. 114 వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 10 July 2026 8:22 PM IST
Tada
X

Tada: వాటంబేడు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే విజయశ్రీ

తద: తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం, తడ మండలం వాటంబేడు సచివాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం స్థానికంగా విశేష ప్రజాదరణ పొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ గ్రామస్తులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ప్రజల పట్ల ఆమె చూపుతున్న ఆప్యాయత, నిబద్ధత గ్రామాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి, ముఖ్యంగా వికలాంగుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకోవడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. "ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నాకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి కలవండి, ప్రజా సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను" అని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు.

​ఈ ప్రజాదర్బార్‌లో భాగంగా వివిధ శాఖల అధికారులతో ఆమె సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజల నుండి మొత్తం 114 వినతులు స్వీకరించారు. వాటిలో ఎంఆర్వో కార్యాలయానికి 52, ఎంపిడీవో కార్యాలయానికి 46, హౌసింగ్ ఎఇ కి 5, పంచాయతీ రాజ్ AEకి 3, జల వనరుల శాఖకు 3, వ్యవసాయ శాఖకు 2, అలాగే CDPO, వైద్య & ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ AEలకు చెరో 1 వినతి చొప్పున అందాయి. వచ్చిన ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే కఠినంగా ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ, తడ ఎస్ఐ కె. కొండప్ప నాయుడు పాల్గొని శాంతిభద్రతల అంశాలపై సమన్వయం చేశారు. అలాగే, బెస్త సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బొమ్మన్ శ్రీధర్ పాల్గొని మత్స్యకార సామాజిక వర్గ సమస్యల పట్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తమ బాధ్యతని ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజాదర్బార్‌ ద్వారా సమస్యలు పరిష్కారం కానుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story