Ojili: స్టూడెంట్స్.. పాలిటిక్స్‌పై లుక్కేయండి.. ఎమ్మెల్యే విజయశ్రీ
Ojili: ఓజిలి ఏకలవ్య మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 'జాతీయ యూత్ మాక్ పార్లమెంట్' సమావేశాన్ని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు.
Ojili: స్టూడెంట్స్.. పాలిటిక్స్‌పై లుక్కేయండి.. ఎమ్మెల్యే విజయశ్రీ
ఓజిలి: విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు దేశ రాజకీయాలు, ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై పరిపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు. ఓజిలిలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 'జాతీయ యూత్ మాక్ పార్లమెంట్' సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల అధ్యాపక బృందం ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చడానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, ఒడిశా మరియు దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది గిరిజన విద్యార్థులు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల పాత్రలను పోషించి, దేశ సమస్యలపై గళమెత్తారు. అసలైన పార్లమెంట్ సమావేశాన్ని తలపించేలా విద్యార్థుల ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది.
మరోవైపు, డాక్టర్ నెలవల విజయశ్రీ సేవా దృక్పథంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన విజయశ్రీ, శాసనసభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆమె నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వైద్యురాలిగా ప్రజల ఆరోగ్యంపై, నాయకురాలిగా నియోజకవర్గ అభివృద్ధిపై చూపిస్తున్న చొరవ అభినందనీయం. అలుపెరుగని ఈ ప్రయాణం నియోజకవర్గ ప్రజలకు ఎంతో భరోసానిస్తోంది.
ఈ కార్యక్రమంలో ఓజిలి గ్రామ సర్పంచ్ లలితమ్మ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, మినిస్ట్రీ ఆఫ్ డైరెక్టర్ బి.పి. ఆచార్య, డిప్యూటీ కమిషనర్ కుముద్ కుష్వాహ, జి. కృష్ణారావు, ధర్మేంద్ర కుమార్ సింగ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




