Sullurpeta: మాట తప్పని నేత.. వారం రోజుల్లోనే సమస్య తీర్చిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే!
Sullurpeta: సూళ్ళూరుపేట చేపల మార్కెట్‌లో నెలకొన్న కనీస వసతుల సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ వారం రోజుల్లోనే పరిష్కరించారు.
Sullurpeta: మాట తప్పని నేత.. వారం రోజుల్లోనే సమస్య తీర్చిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే!
తిరుపతి జిల్లా: సూళ్ళూరుపేట పట్టణంలోని చేపల మార్కెట్ వ్యాపారులు, వినియోగదారుల చిరకాల ఇబ్బందులను తీరుస్తూ స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ సరికొత్త ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో భాగంగా వారం రోజుల క్రితం మార్కెట్ పరిసరాలను పరిశీలించిన తరుణంలో, అక్కడ కనీస వసతులు లేక ప్రజలు, ముఖ్యంగా మహిళా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన విజయశ్రీ, వారం రోజుల్లోగా ఇక్కడ మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని ప్రజలకు నమ్మకమైన మాట ఇచ్చారు.
అన్నట్లుగానే నేడు యుద్ధప్రాతిపదికన ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, మాటపై నిలబడే నిజమైన ప్రజా నాయకురాలిగా నిరూపించుకున్నారు. వారం తిరక్కుండానే సమస్యను పరిష్కరించడంపై మార్కెట్ వ్యాపారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, "ఎమ్మెల్యే మాట అంటే మాట.. నాడు హామీ ఇచ్చారు, నేడు చేసి చూపించారు" అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
'ఆపరేషన్ క్లీన్ స్వీప్' నినాదంతో పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడమే కాకుండా, ప్రజల ప్రాథమిక అవసరాలను తీరుస్తున్న ఎమ్మెల్యే నిబద్ధతకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. హామీలను నిలబెట్టుకుంటూ ప్రజా హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న ఎమ్మెల్యే విజయశ్రీకి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల ఇదే రీతిలో తక్షణమే స్పందిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.




