Nagari: పేదల సేవలో ఎమ్మెల్యే.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల అందజేత

Nagari: చింతల పట్టెడలో 'పేదల సేవలో' భాగంగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 July 2026 2:56 PM IST
Nagari
X

Nagari: పేదల సేవలో ఎమ్మెల్యే.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల అందజేత

నగరి: పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు.

'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని చింతల పట్టెడ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,మున్సిపల్ అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story