Satyavedu: రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే!
Satyavedu: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు.
Satyavedu: రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే!
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కెవిబిపురం మండలంలో ఘనంగా నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ కార్యక్రమంలో మండలం నాయకుల ఆధ్వర్యంలో సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
కే వి బి పురం మండలంలో సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం గారికి తెలుగు మహిళలు అక్క చెల్లెమ్మలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి పసుపు పూల మధ్య బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు.
తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ - రైతుల పార్టీ భూమిలో బంగారం దాచేవాడు రాజు అయితే భూమిలో బంగారం పండించే వాడే రైతు అలాంటి రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని కోనేటి అదిమూలం గారు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ కు సంబంధించి మన భూములను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేపించి రెవెన్యూ పట్టా పాస పుస్తకాలు అందించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఆయనకు కోనేటి ఆదిమూలం గారు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అండగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని పేదలకు అన్ని విధాల ఆదుకుంటూ సంక్షేమం మరియు అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళని ప్రతి రైతును ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ రెవిన్యూ గ్రామసభల ద్వారా రైతులకు పట్టా పాస పుస్తకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించడంలో ముందుందని రైతే దేశానికి వెన్నెముకని గుర్తు చేశారు, కే వి బి పురం మండలాన్ని పర్యటక కేంద్రంగా తీర్చి దిద్దే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని అలాగే వ్యవసాయ రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల ముందు ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామపంచాయతీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




