Naidupeta: తిరుపతిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజయశ్రీ!

Naidupeta: తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల పట్టువస్త్రాల సమర్పణకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Sept 2026 7:40 PM IST
Naidupeta
X

Naidupeta: తిరుపతిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజయశ్రీ!

Naidupeta: తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ. ​ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ హెలిపాడ్ వద్ద ఆత్మీయ స్వాగతం.

​ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన ఎమ్మెల్యే డా. విజయశ్రీ, టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం.

​కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సకుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం లభించింది.

​మంగళవారం తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (SV Agricultural University) హెలిపాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ , నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ & మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ఆత్మీయ స్వాగతం పలికారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్