Tirupati: ఓటేరులో రూ. 1.03 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
Tirupati: తిరుపతి రూరల్ మండలం ఓటేరులో రూ. 1.03 కోట్లతో నిర్మించిన 9 సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Tirupati: ఓటేరులో రూ. 1.03 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామ పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పంచాయతీకి చేరుకున్న ఎమ్మెల్యే గారికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికిన మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు,కార్యకర్తలు.
గగ్రామంలో వెలసిన శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఓటేరు గ్రామ పంచాయతీలో నూతన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. నూతన సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని.
ఓటేరు పంచాయతీలో 09 అభివృద్ధి పనులకు.....సుమారు 1 కోట్ల 03 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుండి ఓటేరు పంచాయతీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అని తెలిపిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు....... చేతల ప్రభుత్వం.
ఎలక్షన్ సమయంలో ఓటేరు పంచాయతీలోని ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నాన ని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.
అని ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే. స్థానిక సంస్థలు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తరపున అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిస్తాం.... ఎమ్మెల్యే. పంచాయతీలోని చిన్న..... చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమస్య పరిష్కారమయ్యే విధంగా చొరవ చూపుతా ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




