Srikalahasti: గంగమ్మ తల్లికి ఆడబిడ్డ సారె సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల
Srikalahasti: శ్రీకాళహస్తి బీపీ అగ్రహారంలో గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు అమ్మవారికి సారె సమర్పించారు.
Srikalahasti: గంగమ్మ తల్లికి ఆడబిడ్డ సారె సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల
Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలో బిపి అగ్రహారంలో వెలసిన శ్రీగంగమ్మ తల్లి జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి ఆడబిడ్డ సారే ను శ్రీ కాళహస్తి దేవస్థానం తరఫున ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సారిని సమర్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి లో ఏడు గంగమ్మల కి పరిమితమైన సార పాలకమండలి ఏర్పాటైన తర్వాత ఏడు గంగమ్మ కి కాకుండా బీపీ అగ్రహారం గంగమ్మకు,
పానగల్ గంగమ్మకు, బంగారమ్మ తల్లికి, నల్ల గంగమ్మకు, శీతలాంబ కు, త్రిశూలంబకు, శ్రీకాళహస్తిలో వెలసిన గ్రామ శక్తి అమ్మవార్లకు అందరికీ కూడా సార అందజేసే అనువాయితీ ని తమ కోట మీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో గంగమ్మ తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ విధంగా ఆ ప్రాంతం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటు రోగాలు లేకుండా దుష్ట శక్తులు లేకుండా వీటి అన్నింటి కూడా గ్రామ దేవతలు కాపాడుతుందని అని తెలియజేశారు.
ఈ ప్రాంతమంతా సుభిక్షంగా మరియు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీ శ్రీ గంగమ్మ తల్లినీ దర్శించుకుని అమ్మవారి చల్లని దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను. తనకు ఈ వార్డుతో విడదీయలేని అనుబంధం ఉందని, గత ఎన్నికల్లో తనకు అత్యధిక ఓట్లు తెచ్చిపెట్టిన వార్డు ఇదేనని ఈ వార్డుకు మరో మూడు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేసి, వార్డును సుందరీకారంగా తీర్చిదిద్దే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు.




