Tirupati: సూళ్ళూరుపేటలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు!
Tirupati: జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో 'పల్లె పండుగ 3.0' ద్వారా రూ. 15 కోట్ల భారీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీకారం.
Tirupati: సూళ్ళూరుపేటలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు!
Tirupati: పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేసిన ఆమె, నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు.
నాయుడుపేట రూరల్ పరిధిలోని మర్లపల్లి గ్రామంలో రూ. 5.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి. రోడ్డు పనులకు, రూ. 1.80 లక్షల అంచనాతో చేపట్టనున్న పశువుల పాక నిర్మాణానికి ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ స్వయంగా భూమిపూజ చేసి పనులను ఘనంగా ప్రారంభించారు.
గతంలో చేపట్టిన 'పల్లె పండుగ 1.0', 'పల్లె పండుగ 2.0' కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ పరిధిలో దాదాపు 33 వరకు సి.సి., బి.టి. రోడ్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 'పల్లె పండుగ 3.0' ద్వారా ఏకంగా రూ. 15 కోట్ల భారీ నిధులతో నియోజకవర్గవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పల్లె సీమల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.
గ్రామాల్లో ఆధునిక రహదారుల నిర్మాణం, రైతాంగ సంక్షేమం, ప్రజా సౌకర్యాల మెరుగుదలే పరమావధిగా తాను నిరంతరం శ్రమిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, అధికారులందరూ అందుబాటులో ఉంటూ నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, సమగ్ర వికాసమే ధ్యేయంగా అహరహం శ్రమిస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయకత్వంలో సూళ్ళూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.




