Tirupati: నాయుడుపేట మర్లపల్లిలో పల్లె పండుగ 3.0 ప్రారంభం!
Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా రూ. 15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ.
Tirupati: నాయుడుపేట మర్లపల్లిలో పల్లె పండుగ 3.0 ప్రారంభం!
Tirupati: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని పిలుపుగ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు.
'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట రూరల్ పరిధిలోని మర్లపల్లి గ్రామంలో రూ. 5.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి. రోడ్డు పనులకు, అలాగే రూ. 1.80 లక్షల అంచనాతో చేపట్టనున్న క్యాటిల్ షెడ్ (పశువుల పాక) నిర్మాణానికి ఎమ్మెల్యే గారు స్వయంగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ గతంలో చేపట్టిన 'పల్లె పండుగ 1.0' మరియు 'పల్లె పండుగ 2.0' ద్వారా నియోజకవర్గంలో దాదాపు 33 వరకు సి.సి., బి.టి. రోడ్ల నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.ప్రస్తుతం ప్రారంభమైన 'పల్లె పండుగ 3.0' ద్వారా దాదాపు రూ. 15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను,నియోజకవర్గవ్యాప్తంగా నేటి నుండి ముమ్మరంగా చేపడుతున్నామని తెలియజేశారు.
గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారుల మెరుగుదల, రైతాంగ సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, నిర్దేశిత గడువులోగా పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




