Naidupeta: నాయుడుపేటలో రూ.21 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయశ్రీ శ్రీకారం!

Naidupeta: నాయుడుపేటలో రూ.21 కోట్లతో HAM పనులు, నూతన మున్సిపల్ భవనానికి ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ భూమిపూజ చేశారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2026 5:25 PM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేటలో రూ.21 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయశ్రీ శ్రీకారం!

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో HAM అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ,నాయుడుపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ తెలిపారు.మంగళవారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో రూ.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ ఆవిష్కరించారు.అనంతరం నాయుడుపేట పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, నాయుడుపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని తెలిపారు.పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తామని, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు నూతన మున్సిపల్ కార్యాలయ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మంజూరైన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.సూళ్లూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, నాయుడుపేట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్