Chandragiri: మోహన్ బాబు వర్సిటీలో పరిశోధన, ప్రచురణ నైతికతపై రీసెర్చ్ వర్క్‌షాప్

Chandragiri: మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో 3 రోజుల రీసెర్చ్ వర్క్‌షాప్ ముగిసింది. ఎన్టీయూ, జేఎస్ఎస్ ప్రొఫెసర్లచే ఏఐ, లాటెక్ (LaTeX) నైతిక వినియోగంపై శిక్షణ.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 4 Nov 2026 4:40 PM IST
Chandragiri
X

Chandragiri: మోహన్ బాబు వర్సిటీలో పరిశోధన, ప్రచురణ నైతికతపై రీసెర్చ్ వర్క్‌షాప్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని ​మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఆవిషరణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు రోజుల వర్క్ షాప్ లో చివరి రోజైన బుధవారం “పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత” వర్క్‌షాప్ ఉత్సాహంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్టీయూ ప్రొఫెసర్ నరసింహన్ సుందరరాజన్ మాట్లాడుతూ, పరిశోధనలో సాహిత్య సమీక్ష చేయడం, రీసెర్చ్ గ్యాప్స్‌ను ఖచ్చితంగా గుర్తించడం, ఏఐ సాధనాలను నైతికంగా ఎలా వినియోగించుకోవాలో వివరించారు. అదేవిధంగా మైసూరు జేఎస్ఎస్ వర్సిటీ ప్రొఫెసర్ మహానంద్

బి.ఎస్. లాటెక్ ద్వారా పరిశోధనా పత్రాలు, థీసిస్‌లు, శాస్త్రీయ నివేదికలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించే విధానంపై అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు ప్రత్యక్ష ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం పరిశోధనా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతగానో దోహదపడిందని వారు పేర్కొన్నారు. .

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI